మధిర, అక్టోబర్ 6 (జనంసాక్షి) : మధిర పట్టణంలోని లడక్బజార్ నందు దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద సిఐ వేణుమాధవ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహన్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. మునుముందు కూడా మరిన్నీ సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు చెరువుపల్లి శ్రీధర్, మొండితోక సుధాకర్, శ్రీనివాసరావు, మిరియాల కాశి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




