మహిళా సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు
మూడ్రోజులపాటు అంతర్జాతీయమహిళా దినోత్సవం
వెల్లడిరచిన మంత్రులు సబిత,సత్యవతి
హైదరాబాద్,మార్చి4(జనం సాక్షి): సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెట్టపీట వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మహిళా సంక్షేమకార్యక్రమాలకు పెద్దపీట వేశారని అన్నారు. అలాగే వారిరోణకు షీ టీమ్స్ ఎంతగానో ప్రాముఖ్యతను పొందాయని అన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో మహిళలకు, గర్భిణిలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎండకాలం వస్తే నీళ్ల కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.
పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత కోసం.. వడ్డీ లేని లేకుండా రుణాలు ఇస్తోందన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు పెద్దపీట వేశారని మంత్రి అన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరిచ్చి మహిళా సమస్యలు తీర్చారని తెలిపారు. షీ టీమ్, భరోసా కేంద్రాలు పెట్టి మహిళా రక్షణ చర్యలు చేపట్టారన్నారు. మహిళా భద్రతలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో మహిళ లకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. మహిళల కోసం పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారన్నారు. మహిళల కోసం ఇంత చేసిన కేసీఆర్ మహిళాబంధు అని కొనియాడారు. ప్రతీ మహిళా… మహిళా దినోత్సవంలో భాగం కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారన్న ఘటనపై విచారణ జరుగుతోందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలాంటి ఘటనలను ఎవ్వరూ ప్రోత్సహించరని, కచ్చితంగా ఖండిరచాల్సిందేనన్నారు. విచారణలో నిజానిజాలు బయట పడతాయన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఘటనపై విపక్షాలు ఆరోపణలు అంటున్నారని, దోషులు ఎవరో పోలీసులు తేల్చుతారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ ప్లెక్సీలకు రాఖీ కట్టడం, పని చేస్తున్న మహిళలను గౌరవించడం, సన్మానించడం, అన్ని ప్రాంతాల్లో మహిళలకు జరిగే అభివృద్ధి వివరించడం వంటి పనులు చేపడుతామన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తామన్నారు. ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.




