హైదరాబాద్(జనం సాక్షి): పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయనే వదంతుల నేపథ్యంలో అమాయకులపై జరుగుతున్న దాడులపై నగర సీపీ అంజనీకుమార్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీసీపీలు, టాస్క్‌ఫోర్స్ అధికారులు భేటీకి హాజరయ్యారు. చాంద్రాయణగుట్ట, మాదన్నపేటలో జరిగిన దాడి ఘటనలపై సీపీ సమీక్షను చేపట్టారు. అమాయకులపై దాడులు నివారించడానికి తీసుకునే చర్యలపై భేటీలో చర్చిస్తున్నారు.




