అమ్మాపురం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-

తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి )మండలము లోని ,అమ్మా పురము,గ్రామ పంచాయతీ ఆవరణ లో స్థానిక సర్పంచ్ కడెం.యాకయ్య ఆధ్వర్యం లో జాతీయ జెండా ఆవిష్కరణ, మొదట గా తెలంగాణ అమర వీరుల ను స్మరిస్తూ నివాళులు అర్పించడం జరిగింది.గ్రామ సర్పంచ్ కడెం.యాకయ్య  మాట్లాడు తూ నిజాం నిరంకుశ  పాలన లో తీవ్ర ఆవేదన, సమస్యల తో నరకం చూసిన తెలంగాణ ప్రజల కు ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకం గా శ్రద్ధ పెట్టి నిజాం నవాబు మెడలు వంచి 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల కు విముక్తి ప్రసాదించాడని ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు కు స్వాతంత్ర్యం వచ్చిందని ఈ సందర్భం గానే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపు కుంటున్నామని మాట్లాడినాడు.అనంతరం మన జాతీయ జెండా ను ఎగర వేయడం జరిగింది.ఈ కార్య క్రమం లో గ్రామ సర్పంచ్ కడెం. యాకయ్య,గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.శ్రావణి,గట్టు. అశోక్ గౌడ్,గ్రామ పంచాయతీ సిబ్బంది,స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొని జెండా పండుగ ను ఘనం గా విజయవంతం చేయడమైనది.