అర్జున్ బాబు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం
బయ్యారం, ఆగష్టు 31(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల మాజీ సర్పంచ్ బానోత్ అర్జున్ బాబు బుధవారం అనారోగ్యం కారణంగా మరణించారు.విషయం తెలిసిన బయ్యారం కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అదే విధంగా గార్ల మండల కేంద్రంకి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి లక్ష్మీ మామగారు కొండపల్లి అప్పయ్య స్వర్గస్తులవగా వారి ఇంటికి వెళ్లి పార్ధివ దేహానికి వారి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్,భూక్య దాల్ సింగ్ నాయక్,మహబూబాబాద్ జిల్లా మాజీ జెడ్పిటిసి సభ్యులు జన్నారెడ్డి పద్మజ వెంకటేశ్వర్లు,బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి ఎంపిటిసి మోహన్ జీ బానోత్, ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, జగత్రావుపేట సర్పంచ్ కారం భాస్కర్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు రాము నాయక్, సీతారాం రెడ్డి,సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు గంగావత్ రవి నాయక్, భీమా కుమార్,హరి తదితరులు పాల్గొన్నారు.