అర్ధ నగ్న ప్రదర్శన తో వీఆర్ఏల నిరసన దీక్ష.

కూసుమంచి జులై 30 (జనం సాక్షి): వీఆర్ఏల హక్కుల సాధనకై రాష్ట్ర వీఆర్ఏ ల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆరవ రోజు వీఆర్ఏలు అర్ధ నగ్నంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తమ నిరసన వ్యక్తం చేశారు. తాసిల్దార్ కార్యాలయం నుండి అర్ధనగ్నంగా వీఆర్ఏలు ప్రదర్శనగా బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి తమకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కేలు జీవోలు వెంటనే అమలు చేయాలని 55 సంవత్సరం నిండిన వీఆర్ఏ కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని అర్హత కలిగిన వారికి వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ తమ యొక్క నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ హాసిని మాట్లాడుతూ చిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచనకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తమ యొక్క ఆవేదన అర్థం చేసుకొని వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తమ యొక్క సమ్మెకు మద్దతు తెలపాల్సిందిగా తాసిల్దార్ కు మరియు కార్యాలయ సిబ్బందికి గులాబీ పువ్వులు అందజేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల జేఏసీ అధ్యక్షుడు ధారా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుడ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష, కోశాధికారి రవి, వీఆర్ఏలు పడిశాల శ్రీనివాస్, మోదుగు వీరబాబు, వీరన్న, నరేందర్ మరియు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వీఆర్ఏలు పాల్గొన్నారు.