అర్హులందరికీ పింఛన్లు : ఎంపీపీ కరణం అరవింద్ రావ్

పరిగి రూరల్, సెప్టెంబర్ 22 ( జనం సాక్షి ) :
వృద్దులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక వెసలు బాటు కల్పించేందుకు అర్హులందరికీ పింఛన్లు అందజేయనున్నామని ఎంపీపీ కరణం అరవింద్ రావ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో గురువారం పింఛన్ ప్రొసిడింగ్స్ ప్రతాలు,కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ కరణం అరవింద్ రావ్ మాట్లాడుతూ ఇంటి పెద్ద దిక్కులా ఆదరిస్తూ ప్రతి నెలనెల పింఛన్లు అందజేస్తున్నారన్నారు.దరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరలో రానున్నాయన్నారు. ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముదుసూదన్ రెడ్డి, నాయకులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాపోల్ ఎంపీటీసీ ఉప్పరి రవి సాగర్ ,పొల్కంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
22 పిఆర్ జి 02లో పొల్కంపల్లి గ్రామంలో పింఛన్ ప్రొసిడింగ్ పత్రాలను అందజేస్తున్న ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ