అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులందరికి దళిత బందు ఇవ్వాలి: సిపిఐ డిమాండ్
గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాజకీయాలకు అతీతంగా దళితులందరికి దళిత బందు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం తహసిల్దార్ కార్తిక్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో తల దాచుకుంటుంన్నారని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని అలాగే స్థలము ఉండి ఇల్లు లేని పేదవారికి ప్రభుత్వం 3లక్షల రూపాయలు ఇచ్చి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.రాజకీయాలకు అతీతంగా దళితులందరికి దళిత బందు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, కడియాల అప్పయ్య, చేవ వెంకన్న, జోనలగడ్డ తిరపయ్య, జానపటి సైదులు, ప్రతాని సైదులు, మెండే వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.