*ఉపాధి హామీ పనులు చేయకుండా బిల్లులు కాజేసిన సర్పంచ్,
* అయోధ్య నగర్ గ్రామస్తులు,
*విచారణ పేరిట వచ్చి వాయిదా వేసిన అధికారులు,
* సర్పంచ్ ఉప సర్పంచ్ కి వత్తాసు పలుకుతున్న అధికారులు,
*పలువురు గ్రామస్తులు ఆవేదన,
ఖానాపురం సెప్టెంబర్ 14జనం సాక్షి
మండలంలోని అయోధ్య నగర్ గ్రామంలో గ్రామ మొదటి ప్రథమ పౌరుడు జాతీయ ఉపాధి హామీ పనుల్లో పని చెయ్యకుండా అధికారులు నేను చెప్పింది వింటారు. అనే వంకతో వచ్చిన కాడికి దండుకోవాలని ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పనులు చేయకుండానే మేటి తో కలిసి డబ్బులు తన అకౌంట్లో జమ చేసుకున్నాడు కానీ నేను ప్రథమ పౌరుడిని కదా ఎవరికీ తెలియదు అని అనుకున్నాడేమో గ్రామ ప్రథమ పౌరుడు కానీ గ్రామస్తులు వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎంపీడీవో సుమనవాణి, ఎం పీ ఓ కీర్తి సునీత విచారణ పేరుతో బుధవారం అయోధ్య నగర్ గ్రామపంచాయతీ కి చేరుకోవడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడంతో అధికారులు నిజ నిజాలు పూర్తిస్థాయిలో తెలిసిన అవినీతికి పాల్పడిన సర్పంచ్, ఉప సర్పంచ్, ఉపాధిహామీ మేటు పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటనిగ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడ్డ వారికి వత్తాసు పలుకుతూ గ్రామస్తులకు అన్యాయం చేస్తున్నారనిగ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దుచేయాలని అలాగే గ్రామస్తులకు న్యాయం చేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు యాకన్న, రాజు, శైలజ, వీరన్న, మాజీ ఎంపిటిసి జగన్, పెండ్లి రాజు,ఎర్ర వర్దరాజు,మల్లేష్,విజయ్, బక్కులు, తావుర్య గ్రామస్తులు పాల్గొన్నారు.