అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండా.
నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 12(జనంసాక్షి) అసహయులకు ఆసరాతో తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు. సోమవారం తాండూర్ పట్టణం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డ్ సాయిపూర్ లో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని, ఆసరా పెన్షన్లు నిరుపేద జీవితాలకు భరోసా నిస్తునాయన్నారు .తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ విద్య, వైద్యం, ఇలా ఏ రంగాన్ని కూడ విశ్రమించ కుండా అన్ని రంగాలను సమదృష్టితో చూస్తూ తెలంగాణను భారతదేశానికి దిక్సూచిగా మలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నూతన పెన్షన్ లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.