ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 30
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి గ్రామంలో శుక్రవారం అర్హులైన మహిళలందరికీ సర్పంచ్ రాధా రామచందర్ ఉప సర్పంచ్ వలకొండ రాజు చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీ శిరీష్ కాంతు అమర్ సింగ్ సిద్దు రాజు కాశీరాం రవి గ్రామ ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు
Attachments area