ఆపదలో ఉన్న వారికి అండగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 24
ఆపదలో ఉన్నవారికి మైనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్ఓ) అండగా ఉంటుందని నేరేడ్ మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు.
నేరేడ్ మెట్ డివిజన్ యాప్రాల్ లోని క్రింది బస్తీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గండు రాజేష్ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. స్థానిక నాయకుల ద్వారా విషయమును తెలుసుకున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రోహిత్ బాబు ద్వారా 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయంను గండు రాజేష్ యాదవ్ భార్య సుజాతకు స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.మల్కాజిగిరి నియోజకవర్గం లోనే కాకుండా అన్ని ప్రాంతాల పేదలకు,అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి,రేగటి శివకుమార్ గౌడ్,గోకుల్,రమేష్, మోహన్,రాజేష్,నవీన్,శోభ,రమాదేవి, ఆరతి,పరిమళం,విజయ,లక్ష్మి, బాదితుని కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు