ఆర్థిక సహాయం చేయూత అంబేద్కర్ యూత్

పాలకవీడు మండలకేంద్రము నకు చెందిన అవిరేండ్ల నాగరాజు,రాములమ్మ ల కుటుంబం నకు  స్థానిక ఎంపిటిసి మీసాల ఉపేందర్, అంబేద్కర్ యూత్ సభ్యులు సేకరించిన 61,100 రూపాయలు ను యూత్ సభ్యులతో కలిసి ఆదివారం నాడు అందించారు. నాగరాజు నిరుపేద  కుటుంబానికి చెంది స్వంత గుడిసె కూడా లేకుండా కస్తూరిబా గాంధీ విద్యాలయ నిర్మాణ పనులకు తాత్కాలికంగా వేసిన గుడిసెలో నివసిస్తూ రోజు వారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఒక సంవత్సరం క్రితం నాగరాజు మెదడులో రక్తం గడ్డ కట్టి అతనికి కాళ్ళు, చేతులు పక్షవాతం వచ్చి,కంటి చూపు కూడా కోల్పోయి మంచానికే పరిమితం అయ్యారు. నాగరాజు బాగోగులు చూడటానికి అతని భార్య రాములమ్మ ఇంటికే పరిమితం కావడంతో ఇంట్లోకి తినడానికి లేక, హాస్పిటల్ కి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గమనించిన అంబేద్కర్ యూత్ సభ్యులు తోడ్పాటు అందించడం అభినందనీయం అన్నారు.మున్ముందు కూడా ఇలాగే ఐకమత్యంగా ఉంటూ,నిరుపేదలకు తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యూత్ సభ్యులు, కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.