ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి మండల అధ్యక్షుడు వరుణ్ కుమార్

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్

సారంగపూర్ మండలంలోని రేచపల్లి మరియు గణేశపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాణోత్ వంశీ మరియు గుండుగుల రాజేష్ గారి కుటుంబాలని పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం అందజేసిన సారంగపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు బద్దెల గంగరాజం, మండల యువ మోర్చా అధ్యక్షుడు దీటి వెంకటేష్, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్,మండల యువ మోర్చా కార్యదర్శి సుంకం వేణు,బూత్ అధ్యక్షుడు అల్లెపు చిరంజీవి,గిరిజన మోర్చా నాయకులు అంజి,బాణోత్ శేఖర్,ఇడగొట్టు సంతోష్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.