ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఇన్సూరెన్స్ క్యాంప్
కొత్తగూడ జూలై 20 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోగుళ్ళపల్లి గ్రామం లో ఇండియన్ బ్యాంక్ కరీంనగర్ జోనల్ ఆఫీస్ వారి ఆదేశాల మేరకు కొత్తగూడ ఇండియాన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఎస్ హెచ్ జి,ఎస్ ఎస్ ఎస్ డ్రైవ్ లో భాగంగా ఇన్సూరెన్స్ క్యాంపెను నిర్వహించారు.ఈ క్యాంప్ లో కొత్తగూడ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాలజ్యోతి మాట్లాడుతూ మీ కుటుంబానికి అండగా మన ఇండియన్ బ్యాంక్ ఉంటుందని మన బ్యాంకులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (20) రూపాయలు,ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన(436) రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఆ వ్యక్తి మరణించినట్లయితే నాలుగు లక్షల వరకు ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి లబ్ధి పొందుతారని అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు మన బ్యాంకు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగమ్మ రవి,మహిళ సంఘాల సి ఎ గణపతి,బ్యాంకు మిత్రులు రాజు,లక్ష్మణ్,సారంగపాణి,మహేందర్,అశోక్, కుమారస్వామి,స్వరూప,శివ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.