ఇండ్ల పేరుమీద ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నరు.

బిజెపి మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ప్రభాకర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 24. (జనంసాక్షి) డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మీద ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశించి బిజెపి నాయకులు మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా సిరిసిల్ల పట్టణం లోని వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జరిగిన దీక్షకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో రెండు దఫాలుగా ఓట్లు దండుకున్న బి ప్రజలకు మొండి చేయి చూపించిందని ఆరోపించారు. నిరుపేదలకు ఇచ్చిన హామీని అమలు చేయలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు తుల ఉమ, ఏర్రం మహేష్, అల్లాడి రమేష్, ఆడెపు రవీందర్, రెడ్డబోయిన గోపి.సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, జిల్లాలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తాజావార్తలు