అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్,అక్టోబర్8 (జనంసాక్షి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానిస్టేబుల్‌ల ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో కూడా 120 మందికి ప్రమోషన్‌లు ఇచ్చారని… కానీ 12 మందికే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగితా వారికి త్వరగా అపాయింట్‌మెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా టైమ్‌లో పని చేసిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తొలిగించిందన్నారు. ఇటీవలే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఇంకా ఆలస్యమవుతోందని.. అలా కాకుండా తొలిగించిన వారిని త్వరగా విధుల్లోకి తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఇటీవలి వర్షాలకు 500 ఎకరాల్లో పంట నష్టం




