ఆదిలాబాద్(జనం సాక్షి ): ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లి సర్వే లావణ్య(25) మృతిచెందగా.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఇద్దరు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




