ఇసుక ట్రాక్టర్ లు సీజ్ ముగ్గురి పై కేసు నమోదు

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనంసాక్షి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం నరసింహుల పేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ శివారు దుబ్బ తండాకు  చెందిన జాటోత్ రాజు తన రెండు ట్రాక్టర్ల ద్వారా అనుమతి లేకుండా ఆకేరు వాగు నుండి ఇసుకను తరలిస్తుండగా మండల కేంద్రంలోని శివాలయం వద్ద టీఎస్ 20 టి 3251 నంబర్ గల,ట్రాక్టర్ నంబర్ లేని మరొక ట్రాక్టర్ సీజ్ చేసి యజమాని రాజుతోపాటు, డ్రైవర్లు మండలంలోని ఆగపేట గ్రామానికి చెందిన  భూక్య పవన్, తూర్పు తండాకు చెందిన ముడావత్ వెంకన్న లపై
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.