ఈటల రాజేందర్ అరెస్టును ఖండిస్తూ బిజెపి నాయకుల నిరసన

హుజూర్ నగర్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి): హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ పోంచర్ల పట్టణ అధ్వర్యంలో మంగళ వారం పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ మాదిరిగానే మునుగోడు గడ్డపై బీజేపీ జెండా ఎగురుతాదని భయంతో సీఎం కేసీఆర్ అరెస్టులకు పూనుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వేముల శేఖర్ రెడ్డి, దేనుమకొండ రామరాజు, కుందూరు కోటిరెడ్డి, మంద వెంకటేశ్వర్లు, చింతలపూడి ఉమామహేశ్వరరావు, దేవిశెట్టీ మురళి, బుషిపల్లి నాగలక్ష్మి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.