యూటీఎస్ యాప్ సేవలు అందుబాటులోకి
– మొబైల్ నుంచి క్షణాల్లో టికెట్లు బుక్చేసుకొనేలా యాప్ రూపకల్పన
– యాప్‌ను ఆవిష్కరించిన ద.మ.రైల్వే జీఎం వినోద్‌కుమార్
సికింద్రాబాద్, జులై12(జనం సాక్షి) : రిజర్వేషన్ లేని సాధారణ (జనరల్) టికెట్లను మొబైల్‌ఫోన్ నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన యూటీఎస్ ఆన్లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ నెల 15 అర్థరాత్రి నుంచి యూటీఎస్ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ద.మ.రైల్వే జీఎం వినోద్ కుమార్ వెల్లడించారు. రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం ద.మ.రైల్వే అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో ద.మ.రైల్వే ముందుందన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని సేవలకు డిజిటల్ పేమెంట్ మోడ్‌లో చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ద.మ రైల్వేలోని పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పష్టంచేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ద్వారా టికెట్లు బుక్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్లాట్‌ఫాం టికెట్లను కూడా యూటీఎస్ యాప్‌ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.




