ఈ నెల 17 ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జహీరాబాద్ ఆగస్టు 12 (జనంసాక్షి) ఈనెల 17న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎరుకల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య కోరారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండల కేంద్రంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక భవనం నిర్మాణం కోసం స్థలము మరియు రెండు కోట్ల నిధులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు కావున భవన శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఎరుకల ఎరుకల కులానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిమ్మల సిద్దు ప్రధాన కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు సత్యారం కృష్ణ, కుల సంఘ నాయకులు కాలప్ప, బాలప్ప, మొగులప్ప, యువ నాయకులు సురేష్, శ్రీకాంత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు