పాటలు జీవన ఆనందం ఉంది బ్రతుకు గాయాల వేదన ఉంది మనసు సౌరబాల మమత ఉంది
మనిషిని మనిషిగా ప్రేమించే ఆనందం ఉంది మానవతా జీవన ప్రేమ గీతికలుగా ఆలపించబడుతూనే ఉన్నాయి
నీవు లేని ఈ పాట నిజంగా నా హృదయంలో మధురిమలను కోల్పోయిన ఎండిన చెట్టు లాగా ఉంది
వసంతం వెళ్లిపోయిన వేళ సిసిరపు జాడల్ని కనిపిస్తుంది
మనిషి ఎంత దూరమైపోయాడు మమతకు మనిషి ఎంత స్వార్ధపు అవకాశవాదపు జాడల్లో తిరుగుతున్నాడు
రగిలించావు ఎంత ఆనందంగా ఈ అగ్నిని భరించాలి ఈ ప్రేమ సంస్కారం లేని సౌఖ్యాన్ని అనుభవించమని ఎక్కడికో వెళ్లిపోయారు
నీవు లేని ఈ పాటలోని రసాన్ని ఆస్వాదించలేదు నా గుండెలో నీరసం జాడలు పదేపదే కనిపిస్తున్నాయి
ఈ నిశ్శబ్ద రాత్రి ఇలాగే ఈ రాత్రి పై సాగిపోవు ఈ వేదనాల ఆరాధనల అంతరంగాన్ని మర్చిపోని
నిన్ను ఎప్పటికీ ఆరాధించే ఆ భావాన్ని కోల్పోయారు ఇక చాలు నీతో ప్రేమాయణం
ఇక ఉంటాను ప్రియనేస్తం సెలవు….
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి కోట 7702537453




