ఎంపీ ఆర్వింద్ జన్మదిన వేడుకలు.

మల్లాపూర్( జనంసాక్షి) ఆగస్ట్:25 మండల కేంద్రంలోని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి గారి జన్మదినం సందర్భంగా బిజెపి కోరుట్ల నియోజకవర్గ యువనేత సురభి నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలో (యస్. టీ గిరిజన మినీ గురుకుల పాఠశాల లో) విద్యార్థిని విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువుల బుక్స్ మెటీరియల్ &కూర్చిలు మరియు ఫ్యాన్స్ ఇతర సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ గౌడ్, BJYM జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, వెంకటేష్ యాదవ్,లక్మి, అంజమ్మ, గయ్య మల్లేష్,గోపిడి శ్రీనివాస్ రెడ్డి, సోమా రెడ్డి, మండ స్వామి తదితరులు పాల్గొన్నారు