రేగొడు( జనం సాక్షి) జూన్ 07 మండల పరిధిలోని పెద్దతండా, పట్టే పొలం, బురాన్ వాడి తాండాలతో పాటు మరుపల్లి గ్రామాలలో గురువారం నాడు మెదక్ ఎక్సైజ్ సిఐలు గోపాల్ మోహన్ కుమార్ ఎస్సైలు విశ్వనాథ్, లక్ష్మణ్, అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.రేగోడ్ లోని సంగీత వైన్స్ లో వివిధ కంపెనీల మద్యం బాటిళ్లను తనిఖీ చేసి అనంతరం మరుపల్లి గ్రామంలో లైసెన్సు లేని కల్లుదుకాణంపై దాడులు నిర్వహించి కేసు నమోదు చేశామని ఎక్సైజ్ అధికారులు తేలిపారు.




