Thursday, 5 November 2026

ఎన్డీయే నుంచి వైదొలిగి

చంద్రబాబు తొందరపడ్డాడు
– కొనసాగి ఉంటే ¬దాపై ప్రధాని సానుకూలంగా స్పందించేవారు
– జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నాం
– తమతో కలిసొస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తాం
– కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌, జులై14(జ‌నం సాక్షి) : ఎన్డీయే నుంచి తెదేపా వైదొలగడంపై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారని, కొనసాగి ఉంటే ¬దాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని అన్నారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా అథవాలే విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రత్యేక ¬దా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు.  ఈ సందర్భంగా రాహుల్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని తానూ, మోదీ రక్షిస్తామని.. కాంగ్రెస్‌ పార్టీని ఆయన రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధ కట్టం కొంతమేర దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమేనని అన్న మంత్రి, ఇప్పటికీ పలు చోట్ల దళితులు వేధింపులను ఎదుర్కొంటున్నట్టు అభిప్రాయపడ్డారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని అందుకు బీజేపీ జాతీయ అధిష్టానం దృష్టిసారించిందన్నారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు పోరాటం చేయడం ద్వారా ప్రజల్లో మరింత చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
—————————