Monday, 2 November 2026

ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణతో ప్రోత్సాహం

సంగారెడ్డి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): విద్యార్థులను చైతన్య పరిచేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ ఎంతగానో దోహదపడుతందని ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణాధికారి అన్నారు. వాట్సప్‌, ఇంటర్‌నెట్‌, ఫేస్‌బుక్‌ల పేరుతో విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా.. చవుదుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యువత ఆవేశాలకు వెళ్లకుండా సంయమనంతో మెలగాలని, వాహనాలు అతివేగంతో నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దన్నారు.పోటి ప్రపంచంలో యువత అన్ని రంగాల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ఇలాంటి సదస్సులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే బాహ్య ప్రపంచంపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థుల సృజనాత్మకత వెలుగులోకి వచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణ ఏకాగ్రత, పట్టుదల యువతను ముందుకు నడిపిస్తాయన్నారు. భవిషత్తులో మరిన్ని శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామని అన్నారు.