Wednesday, 4 November 2026

ఎమ్మార్పీఎస్ టీఎస్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా చెన్నారావుపేట కు చెందిన నర్మెట యాదగిరి ఎన్నిక

జనం సాక్షి,చెన్నారావుపేట
మండల కేంద్రానికి చెందిన నర్మెట యదగిరిని ఎమ్మార్పీఎస్ టి ఎస్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేదాసి మోహన్, రాష్ట్ర కార్యదర్శి అరెపల్లి బాబు,జిల్లా అధ్యక్షులు నమిడ్ల చిన్నస్వామిల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ నియోజకవర్గ మా కుల సంఘానికి ఏలాంటి ఆపద వచ్చిన నా వంతు సహకారాన్ని అందిస్తూ, సంఘాన్ని బలోపేతం చేసేందుకు నా కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.  ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, పార్లమెంట్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వడ్డురి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పసునూరి యాకుబ్,జిల్లా ప్రచార కార్యదర్శి కొంగర స్వామి, మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య, మండల యూత్ అధ్యక్షుడు జంగిలి కిరణ్,ఆకులపెళ్లి దయాకర్అ జయ్,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area