అశ్వరావుపేట, సెప్టెంబర్ 26( జనం సాక్షి) చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూల వాళ్ళవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ నైజాం పాలకులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి పోరాడిన ఉక్కు మహిళ ఐలమ్మ అని ఆమె త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జుజ్జురు వెంకన్న బాబు,తెరాస పార్టీ నాయకులు కలపాల శ్రీనివాసరావు, నార్లపాటి వెంకటేశ్వరరావు, చెప్పనపల్లి బజారయ్యా, బొడ్డపాటి ప్రసాద్,స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు




