ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు అవాస్తవం

 

జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్

జనం సాక్షి, చెన్నరావు పేట

చెన్నారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి మండల అధ్యక్షులు మూడు రమేశ్ మాట్లాడుతూ మొన్న జరిగిన నర్సంపేటలో బిజెపి దీక్షలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు అవాస్తవం, పదిహేను సంవత్సరాలు నర్సంపేటకు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు, మీ రాజకీయ లబ్ధి కోసమే దొంగ దీక్షలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. రైల్వే కాంట్రాక్టులు కోసమే దీక్షలు చేస్తున్నారని, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాలుబంధం కాలువ గుర్తుకు రాలేదా, మా నాయకుడు మూడున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఇంకొక్కసారి మా నాయకుడు పైన తప్పుడు ప్రచారాలు చేస్తే బిజెపి నాయకులను తరిమికొడతామని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనీ, మీ లెక్క మత ప్రచారాలను కాదని విమర్శించారు.