Wednesday, 4 November 2026

ఎలక్ట్రానిక్ వెహికిల్ అవేర్నెస్ క్యాంపును ప్రారంభించిన అడిషనల్ కమిషనర్ శృతి ఓజా

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 02(జనంసాక్షి):
ధన్ ఎంటర్ ప్రైసెస్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం నందు రెండు రోజుల పాటు నిర్వహించే ఎలక్ట్రానిక్ వెహికిల్ అవేర్నెస్ క్యాంపు ను శుక్రవారం అడిషనల్ కమిషనర్ శృతి ఓజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాహన ప్రదర్శనను ధన్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు హరీష్ ఈ.వి వాహనాల వివరాలను వివరించారు.ఈ సందర్భంగా శృతి ఓజా మాట్లాడుతూ… వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ.వి వెహికిల్ వాడకం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి 40 శాతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం లోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.ఈ సమావేశం లో ఎలక్ట్రిసిటీ ఎస్.ఇ నివాస్, ఈ ఈ మమత, డిప్యూటీ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.