ఎల్ఐసి బీమా వారోత్సవాలను బహిష్కరించిన ఏజెంట్లు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి

భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల ఏజెంట్ల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలకు నిరసనగా లియాఫీ 1964 జాతీయ,కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు భీమా వారోత్సవాలను బహిష్కరించినట్లు లియాఫీ 1964 వరంగల్ డివిజన్ ఈసీ మెంబర్ రేగూరి వెంకన్న తెలిపారు. గురువారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గేటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసిదారులకు బోనస్ రేట్లు పెంచాలని, ఐదు సంవత్సరాలకు పైగా బకాయి పడిన (ల్యాప్స్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పాలసీదారులు,ఏజెంట్లు కార్యాలయంలో అందజేసే ఏ విధమైన డాక్యుమెంట్లకైనా రసీదు ఇవ్వాలన్నారు. ఏజెంట్లను ప్రొఫెషనల్స్ గా గుర్తించాలని, వారి పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని అన్నారు ఏజెంట్ల మెడి క్లయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ ను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లియాఫీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బాణాల బిక్షపతి ఆడిట్ కమిటీ సభ్యులు కలడ వెంకటేశ్వర్లు ప్రచార కార్యదర్శి పులి సోమన్న ఏజెంట్లు కిన్నెర పాండు, రాజమౌళి సత్యనారాయణ రెడ్డి, యాకన్న బొమ్మగాని రాంబాబు,ఊడుగుల రాజ్ కుమార్,ఇటికేల రాంబాబు, నాగేశ్వరరావు,ఎల్ల గౌడ్, హరికృష్ణ,యాకన్న తదితరులు పాల్గొన్నారు.