Wednesday, 4 November 2026

ఎస్సై స్రవంతి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 13
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి దళితుల కాలనీలో యువతరాన్ని మాదిగ నా కొడుకుల్లారా తమాషా చేస్తున్నారా అని దుర్భాషలాడిన ఎస్సై స్రవంతి రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలని అణగారిన ప్రజల హక్కులపోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి సీఎల్ యాదగిరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో ఎస్సీ కాలనీలో ఘర్షణ కారణంగా అక్కడికి వచ్చిన ఎస్ఐ స్రవంతి రెడ్డి విచక్షణ కోల్పోయి అక్కడున్న ఓ వర్గం వారిని అసభ్య పాదజాలంతో దూషించి మాదిగ నా కొడుకుల్లారా ఏం చేస్తున్నారు. అని తిట్టారు మాదిగ యువతరాన్ని అవమానించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.