భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందిరానగర్ బస్తీ వాసులకి రక్షణ కల్పించండి – డా. సత్యం శ్రీరంగం.”
కూకట్ పల్లి జనంసాక్షి :ఐడిపిఎల్ భూములు అక్రమాలకు గురికాకుండా కాపాడి భూములపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇంద్రానగర్ బస్తీ వాసులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని టిపిసిసి అధికార ప్రతినిధి డా- సత్యం శ్రీరంగం బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.గురువారం కూకట్ పల్లి నియోజక వర్గం బాలా నగర్ డివిజన్ ఐడిపిఎల్ కు సంబంధించిన భూములలో గుర్తు తెలియని వ్యక్తులు పది ఎకరాల భూమి మాది అని కబ్జా చేస్తున్నారనే సమాచారంతొ ఇందిరానగర్ బస్తీ వాసులతో కలిసి ఆయన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరంగం మాట్లాడుతూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, మధు గౌడ్, తిరుపతయ్య, మహమ్మద్ హుస్సేన్, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, ముఖేందర్, మహేందర్, శేఖర్ గజానంద్, భరత్, వెంకటేష్, పుట్టపాక రాము, మధు తదితరులు పాల్గొన్నారు.




