ఐ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

 కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనంసాక్షి :              ఐ విజన్ కంటి వైద్యశాల అండ్ ఆప్టికల్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో మహిళలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వృద్ధులకు సేవ చేస్తే దైవానికి సేవ చేసినట్లు అని  ఐ విజన్ కంటి వైద్యశాల కన్సల్టెంట్ జానీ పాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించి వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు మరియు కళ్ళజోళ్ళు మరియు మందులు  ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని కొనియాడారు.
Attachments area