కన్నతండ్రి పై దాడికి పాల్పడిన తనయుడితో పాటు కోడలు రిమాండ్

– ఎస్సై విశ్వజన్
దోమ సెప్టెంబరు 11(జనం సాక్షి)
రైతుబంధు పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రి పై కొడుకు, కోడలు దాడికి పాల్పడిందనే నేపథ్యంలో బాధితుడు రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఇద్దరినీ రిమాండ్ చేయడం జరిగిందని దోమ ఎస్ఐ విశ్వజన్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆవేశపూరితముతో    మద్యం కు బానిసలై తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దోమ మండల పరిధిలోని బాస్ పల్లి గ్రామానికి చెందిన తెలుగు పెద్దరామయ్య అనే వృద్ధుడు గత నాలుగు రోజుల క్రితం తన కుమారుడు చంద్రయ్య, కోడలు  సత్యమ్మ, దాడికి పాల్పడిందని ఫిర్యాదు ఇచ్చాడు అని తెలిపారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి, నిజానిజాలు తెలుసుకుని బాధితుల పై కేసు నమోదు చేసి రిమాండ్ చేశామన్నారు. తల్లిదండ్రులపై ఎలాంటి హరాస్మెంట్ కు పాల్పడిన, వారి ఆలనా పాలన పై ఇబ్బందులకు గురి చేసిన, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు చూపించే వారి బాగోగుల పై శ్రద్ధ వహించాలని తెలిపారు.
Attachments area