కన్నవారి జ్ఞాపకార్థం.. ప్రజల సౌకర్యార్థం…

ప్రజా సేవే లక్ష్యంగా భావిస్తా.
– ఎంపీటీసీ కలిమిచర్ల గోపాల్ గుప్తా.
ఊరుకొండ, ఆగస్టు 21 (జనం సాక్షి):
ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ప్రజాసేవే లక్ష్యంగా భావిస్తానని ఎంపీటీసీ కలిమిచర్ల గోపాల్ గుప్తా అన్నారు. కన్నవారి జ్ఞాపకార్థం.. ప్రజల సౌకర్యార్థమే ప్రజలు కూర్చునేందుకు వీలుగా కుటుంబ సభ్యుల సహకారంతో 13 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని కల్వకుర్తి డిప్యూటీ తహాసిల్దార్ కల్మచర్ల రాఘవేందర్ గుప్తా అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారుల వద్ద 11 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయగా, రాంరెడ్డిపల్లి గ్రామానికి రాకపోకలు కొనసాగించే ప్రజల కోసం పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థం ముచ్చర్లపల్లి స్టేజి వద్ద సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీటీసీ కలిమిచర్ల గోపాల్, డిప్యూటీ తహాసిల్దార్ రాఘవేందర్ లు పేర్కొన్నారు. రాంరెడ్డిపల్లి గ్రామంలో ప్రజల మరియు ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మరియు ముచ్చర్లపల్లి స్టేజి వద్ద సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం పట్ల రామ్ రెడ్డి పల్లి సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు, ప్రయాణికులు మరియు పరిసర గ్రామాల ప్రజలు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.