Tuesday, 3 November 2026

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. 

 బిక్కనూర్ గ్రామం లో నత్తనడకన నడుస్తున్న వైకుంఠధామం పనులు
ఎల్లారెడ్డి:మార్చ్  06 (జనంసాక్షి )   ఎల్లారెడ్డి మండల పరిధిలోని భిక్కనూరు గ్రామంలోనీ వైకుంఠధామం పనులు నత్తనడకన నడుస్తున్నాయి.  ఇటి వల కలెక్టర్  ఎల్లారెడ్డి మండలం లో పర్యటించి  ఏ ఏ గ్రామాల్లో వైకుంఠ దా మాలు పుర్తికాలేవో. వాటిని త్వరగా పూర్తి చేసే బాధ్యతను. ఆయాఅధికారులకు ఆదేశాలు జారీచేసారు. అయిన కలెక్టర్  ఆదేశాల తుంగ లో తొక్కి వైకుంఠధామం పనులు పూర్తి చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారు . మరియు గ్రామంలో సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యాడ్ కు తరలించాలి గాని అలా చేయకుండా డా రోడ్డు పక్కన చెరువులో వేస్తున్నారు దానిద్వారా చెరువులో నీరు కలుషితమై గ్రామస్థులు వాపోతున్నారు చెత్త రోడ్డుమీది కి వస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.