కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ

– ఎల్పటి అశోక్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు
చౌడాపూర్,సెప్టెంబర్ 10( జనం సాక్షి): చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోర్ర ఎల్లయ్య సతీమణి అంజమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది.ఆమె మరణ వార్త తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మరియు వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ  సానుభూతి తెలుపుతూ సంతాపం తెలియజేశారు.అతడు అందుబాటులో లేకపోవడంతో రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాసయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు యాదయ్య,మండల ఉపాధ్యక్షులు నరసింహ నాయక్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మాసయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బోర్ర రమేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area