కార్యకర్త కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ..

టిఆర్ఎస్ సీనియర్ నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 29 (జనంసాక్షి):
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి ఆన్నారు. గురువారం ఊరుకొండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పోలే రమేష్ గారి కుమారుడు రిక్కీ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యలు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిగారు రూ.5,000/-, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కబడ్డి మరియు కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి 10,000/-, ఎంపీపీ రాధ జంగయ్య 5,000/-, జడ్పిటిసి శాంతకుమారి రవీందర్ 5,000/-,
సర్పంచ్ కొమ్ము రాజయ్య 5,000/-, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి 5,000/-, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి 5,000/-, మొత్తం 40,000/-* ల రూపాయలను ఈరోజు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి వారి కుటుంబ సబ్యులకు అందజేశారు. కార్యకర్తలకు మరియు పేద ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లవేళలా అండగా ఉంటారని నిరూపించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరి నాయక్ మండల నాయకులు కొమ్ము శీను రాచకొండ గోపి బండి మల్లేష్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ తదితరులు ఉన్నారు.