Wednesday, 4 November 2026

కెసిఆర్‌ జార్ఖండ్‌ పర్యటన ఓ ఫార్స్‌

ముందు తెలంగాణ రైతులను ఆదుకోవాలన్న షర్మిల
హైదరాబాద్‌,మార్చి4(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటనపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఫైర్‌ అయ్యారు. గాల్వాన్‌లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢల్లీిలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరని ప్రశ్నించారు. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న విూకు… అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారనిప్రశ్నించారు. నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరని అన్నారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరని అన్నారు. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్‌కు బాట అని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ డ్రామా తప్ప మరోటికాదన్నారు