Wednesday, 4 November 2026

కెసిఆర్ రైతు వ్యతిరేకి అనడం పైన అమిత్ షా పై మండిపడ్డ కేటీఆర్

కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ గారిని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్…

ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పిఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిది అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

 

రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత…. దేశ రైతాంగం యొక్క తీవ్ర వ్యతిరేకత వలన క్షమాపణ చెప్పిన వారెవరని ప్రశ్నించిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజన లో చేరలేదని కెసిఆర్ గారిని విమర్శిస్తున్న అమిత్ షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో, అదే పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలన్న కేటీఆర్

మీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగి…