Tuesday, 3 November 2026

కొంగరకలాన్ కు తరలివెళ్ళిన టీఆర్ఎస్ నేతలు : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి

ఎల్బీనగర్ ( జనం సాక్షి )    రంగారెడ్డి  జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి సరూర్‌నగర్‌ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు…పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్ళారు. ఈ ర్యాలీని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి, సరూర్‌నగర్‌ డివిజన్ అధ్యక్షులు బోయిని మహేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, మహ్మద్ సలీం, పోలె అరవింద్ కుమార్, కట్ట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.