కొండపాక తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన పిఆర్టియు సభ్యులు

కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 01: సిపిఎస్ విద్రోహ దినం సందర్భంగా కొండపాక మండలంలోని వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పిఆర్టియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులతో కలిసి పక్షాన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు నర్రా భాస్కర్ రెడ్డి, మండల పిఆర్టియు అధ్యక్షులు నర్ర రామచంద్రారెడ్డి నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ వలన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి ఉద్యోగ విరమణ అనంతరం భద్రత ఉండదని తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని  అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియూ మండల అధ్యక్షులు నర్ర రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా, రాష్ట్ర బాధితులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.