కోడేరు మండల కేంద్రం లో ఘనంగా దిన్ దయాల్ జన్మదిన వేడుకలు,

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 25 కోడేరు మండల కేంద్రంలో ఆదివారం రోజు బీజేవైఎం పొర్టీ కోడేరు మండల కమిటీ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోడేరు మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి ధీన్ దయాల్ చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ధీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆయన జన్మదినం సందర్భంగా  మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తుమ్మల   బాలపీరు యాదవ్, బి జే వైఎం మండల అధ్యక్షుడు మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు భాను ప్రకాష్, జిల్లా కన్వీనర్  పరశురాముడు, ఓ బి సి మండల అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షులు చంద్రయ్య, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.