క్రైస్తవులు మైనారిటీలు ఐక్యం కావాలి – మైనార్టీ అధ్యక్షులు బి.బి రెడ్డి ఇన్నా రెడ్డి
క్రిస్టియన్ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 :క్రైస్తవులు మైనారిటీలు ఐక్యం కావాలని మైనార్టీ అధ్యక్షులు బి.బి రెడ్డి ఇన్నా రెడ్డి అన్నారు. క్రిస్టియన్ జేఏసీ
కమిటీ నాలుగు మండలాల పాస్టర్లు ఓరేబు ప్రార్థన
మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మైనార్టీ అధ్యక్షులు బి. బిరెడ్డి ఇన్నా రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో క్రైస్తవులు మైనారిటీలు ఐక్యత ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని ఐక్యతతో సమాధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం క్రిస్టియన్ జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా జంపాల పరశురాం, ఉపాధ్యక్షులుగా డేవిడ్, ఈ. ప్రకాష్ కార్యదర్శిగా ఎర్రగుంట ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా ప్రభుదాస్, కోశాధికారిగా వర కుమార్, కార్యవర్గ సభ్యులు స్టీవెన్, ఐజాక్, ఆదాం నాతో నైల్, విజయ్, సలహాదారులుగా పి స్వామి దాస్, ఆనందం, పీటర్, దానియేల్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.