సికింద్రాబాద్ (జనం సాక్షి ) పేదలు , అట్టడుగున ఉన్న ప్రజలను ఆదరించే మానవత్వం మూర్తీభవించిన మహోన్నతురాలు క్వీన్ ఎలిజబెత్ -2 అని తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్ అన్నారు . గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వైఎంసీలో క్వీన్ ఎలిజబెత్ -2 సంస్మరణ సభ నిర్వహించారు . ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాణి ఎలిజబెత్ కు భారతదేశంతో ఎంతో అనుబంధం ఉందని భారతో పాటు ప్రపంచంలోని అనేక పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆమె ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు . పేద ప్రజలే కాకుండా ప్రపంచంలోని ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు . అలాగే వైఎంసీఏతో కూడా రాణి ఎలిజబెత్ కు ఎంతో అనుబంధం ఉందని అనేక కార్యక్రమాల్లోఆమె పాలిభాగస్తురాలిగా ఉన్నారని అన్నారు . ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాణి ఎలిజబెత్ అనేక మార్లు హైదరాబాద్ కు వచ్చి వెళ్లారని ఆమెకు దేశంతో పాటు నగరంతో కూడా ఎంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు . గతంలో బ్రిటిషర్లు వర్తకం కోసం వచ్చి దేశంలో పాలన సాగించారని కానీ పేదలకు విద్య , వైద్యం లాంటి సేవలు ఉచితంగా అందించారని అన్నారు . ఇప్పుడు తెలంగాణాలో ఎవరైనా స్వేచ్చగా వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని , ఇక్కడ ఉన్న శాంతి సామరస్యాలు ఎక్కడ కనిపించవని అన్నారు . ఈ సందర్భంగా వైఎంసీఏ అధ్యక్షులు జయకర్ డేనియల్ క్వీన్ ఎలిజబెతుకు నివాళులు అర్పించడంతో పాటు అతిధులను ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో వైఎంసీఏ ప్రధాన కార్యదర్శి లెనార్డ్ మైరిన్ , రెవరెండ్ జేమ్స్ సెల్విక్టర్ , పాస్టర్ ధన్ రాజ్ , జేమ్స్ ,
క్వీన్ ఎలిజబెత్ ది మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్:




