గంజాయి సేవించినా కఠినంగా వ్యవహరిస్తాం :
పరిగి ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్
పరిగి రూరల్, సెప్టెంబర్ 2 ( జనం సాక్షి ) :
గంజాయి కలిగి ఉన్నా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీకి చెందిన లక్ష్మయ్య వద్ద గంజాయి ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు సమాచారం తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మయ్య వద్ద ( పావుకిలో ) 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 12 నుంచి 13 వేల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. లక్ష్మయ్యను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తోపాటు ఎస్ఐ సాగర్, సిబ్బంది నర్సింహులు, నవీన్, చంద్రమౌళి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :