గణపతి నగర్ వాసులకు బ్లాంకెట్లను పంపిణీ
వరంగల్ ఈస్ట్ జులై 29 (జనం సాక్షి)
ముంపునకు గురైన గణపతి నగర్ వాసులందరూ ధైర్యంగా ఉండాలని వారందరికీ అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు.
శనివారం రోజున వడివిజన్ బైపాస్ రోడ్డు లోని ముంపునకు గురైన గణపతి నగర్ వాసులకు కార్పొరేటర్ బ్లాంకెట్లను పంపిణీ చేసినారు. అంతకుముందు ముంపు బాధితులకు కార్పొరేషన్ ద్వారా వచ్చిన భోజనాలను వడ్డించినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వలన గణపతి నగర్ ప్రాంతం అంతా కూడా జలమయ మైనందున ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే దగ్గరలోని వినయ్ గార్డెన్లో ఈ కాలనీవాసులందరికీ పునరావాసంకల్పించడంతో పాటు కార్పొరేషన్ ద్వారా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నము, రాత్రిపూట రెండు పూటలా భోజన సౌకర్యాలను కూడా కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న, గణపతినగర్ కాలనీ కమిటీ అధ్యక్షులు జాన్ పాల్, స్థానిక డివిజన్ పెద్దలు దామెరకొండ కరుణాకర్, ముత్తినేని రామ్మూర్తి, విద్యుత్ శాఖకు చెందిన కృష్ణ, సంపత్ రావు, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.