Tuesday, 3 November 2026

గణపతి పూజలు అందుకున్న జడ్పీ చైర్మన్

కోరంటేకులపల్లి, ఆగస్టు 31( జనం సాక్షి ): వినాయక చవితి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఇల్లందు టేకులపల్లి ఉదయం నుండి సాయంత్రం వరకు పలు గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేకంగా పూజలు అందుకున్నారు. ఇల్లందులో ముఖ్య అతిథిగా హాజరై నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి సందర్శించి కొలువుదీరిన గణనాధుని మండపాలును ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ వారిని ప్రోత్సహిస్తూ భక్తిశ్రద్ధలతో నవరాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవలు తీసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించాలని ఆయన కోరారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 12,9,17వ వార్డుల్లో కొలువుదీరిన గణనాథుని మండపాల ప్రారంభోస్తవానికి ముఖ్య అతిథిగా హాజరై,ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన *మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గౌ,,శ్రీ. కోరం కనకయ్య* గారు ఈకార్యక్రమంలో వారివెంట మున్సిపల్ చైర్మన్ శ్రీ.దమ్మాలపాటి వెంకటేశ్వర్లు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్,రైతు సమితి జిల్లా నాయకులు పులిగళ్ళ మాధవరావు, సీ.ఐ రాజు,మడుగు సాంబమూర్తి,మండల రాము, బోళ్ళ సూర్యం, డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు,రమేష్ గౌడ్,కుంటా రాజు,గిన్నారపు రాజేష్,పెద్దినేని రామకృష్ణ,వినోద్,సత్తి, అజ్జు, సాయి, ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు